వందేమాతరం రూపొందించి 150 సంవత్సరాలు..
NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా
వందేమాతరం రూపొందించి 150 ఏళ్లు పూర్తయినసందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేమాతరం 150 ఏళ్ల వేడుకలలో భాగంగా శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థిని విద్యార్థులచే సామూహికంగా వందేమాతరం గీతాలాపన చేయించడం జరిగింది అనంతరం ప్రధానోపాధ్యాయురాలు జె హైమావతి మాట్లాడుతూ వందేమాతరం విశిష్టతను తెలియజేశారు “వందేమాతరం” అంటే “తల్లిదేశానికి నమస్కారం” అనే అర్థంఅని అన్నారు, భారతదేశ స్వాతంత్ర సమరంలో ఈ గీతం ఎంతగానో ఉపయోగపడింది ఈ గీతంలో మన భారతమాతను పచ్చని పంటలతో నిండిన నదినీటితో సంపన్నమైనదని
చల్లని గాలులు వీచే పవిత్ర భూమిపూల సుగంధంతో, ప్రకృతి అందాలతో మెరిసేది మధురమైన భాషలు మాట్లాడే ప్రజలతో నిండినది అని వర్ణించారు దేశం మనకు ఆనందం, శాంతి, వరాలు ఇచ్చే తల్లిలా ఉందని ఈ గీతం చెప్తుంది.అందుకే ప్రతి భారతీయుడు గర్వంగా ఈ గేయం పాడాలి అని సూచించారు.బకించంద్ర చటర్జీ రాసిన ఈ దేశభక్తి గీతం ఎంతో ప్రచుర్యం పొందిందని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పి శైలజ పోటు శ్రీనివాసరావు జి ఆదిలక్ష్మి కె అరుణ సిహెచ్ నవ్య శ్రీ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ సభ్యులు విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు.

