భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 18వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
ఈ రోజు కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 18వ వారం జ్ఙానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిల్ విండో మాజీ డైరెక్టర్ కొంగల అండాలు కుమారుడు కొంగల నర్సింగ్ రావు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లన భారత దేశంలో ఉన్న సబండ వర్గాలు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడిగల్ల బాబు MRPS మాజీ మండల అధ్యక్షుడు చిన్నగల్ల అశోక్, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు మంద శ్రీశైలం,ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మంద ఉప్పలయ్య,బొడ్డు శివ బాబు, బిజెపి నాయకులు కడెం సాయిప్రసాద్ బిఆర్ఎస్ నాయకులు కడెం శ్రీకాంత్,ఎంఆర్పిఎస్ నాయకులు దాసరి బాల్ రాజు, బండారి యాదగిరి, బొడ్డు భాస్కర్,మోల్గరం ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

