ఘనంగా డివైఎఫ్ఐ 46 దినోత్సవం
NTODAY NEWS: నల్గొండ జిల్లా
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ముందుగా *భగత్ సింగ్ చిత్రపటానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పూలమాలవేసి నివాళులర్పించారు డివైఎఫ్ఐ జెండాని జిల్లా అధ్యక్షులు రవి నాయక్ ఆవిష్కరించారు అనంతరం సుభాష్ విగ్రహం నుండి క్లాక్ టవర్ ఎన్జీ కాలేజ్ మీదుగా శివాజీ నగర్ వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా -డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రవి నాయక్ మల్లం మహేష్ లు మాట్లాడుతూ డివైఎఫ్ఐ దేశంలో అతిపెద్ద యువజన సంఘం ఉందన్నారు అందరికీ విద్య ఉపాధి అవకాశాల కోసం డివైఎఫ్ఐ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది అన్నారు. ఒకవైపు కొత్త ఉద్యోగాలు రావడం లేదు మరోవైపు ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం జరుగుతుంది యువత ఉద్యోగాలు లేకపోవడంతో చెడు మార్గం పట్టే అవకాశం ఉందన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నిటిని భర్తీ చేయాలన్నారు.
డివైఎఫ్ఐ నల్గొండ జిల్లాలో గంజాయి, డ్రగ్స్ అరికట్టాలని 10 రోజులపాటు సైకిల్ యాత్ర నిర్వహించిందన్నారు డివైఎఫ్ఐ యువతని చైతన్యం చేస్తూ మంచి మార్గంలో పయనించే విధంగా కృషి చేస్తుందన్నారు. యువజనులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల డివైఎఫ్ఐ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు
ఈ కార్యక్రమంలో *డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పుల్లెంల శ్రీకర్, జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్ జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్ అక్రమ్,కట్ట లింగస్వామి, బాబు, జిల్లా కమిటీ సభ్యులు పాలాది కార్తీక్, పోకల శశిధర్, అంజి, ఆశీర్వాదం,రమేష్, సుకుమార్, నాగేశ్వర్ రావు, రాజేష్, గోపికృష్ణ, షరీఫ్, రఘువరన్,బాలరాజు, రాంబాబు, వేణు తదితరులు పాల్గొన్నారు.

