ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Spread the love

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

NTODAY NEWS

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని లోయోలా హై స్కూల్ 2007-08 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ  విద్యార్థినీ,విద్యార్థుల ఆదివారం రోజున ఘనంగా అపూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో తల్లి తండ్రి తరువాత ఉపాధ్యాయులే విద్యార్థులకు మార్గదర్శకమని, ప్రతి ఒక్క విద్యార్థి ఉపాధ్యాయుల మాట వింటే ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తామని , పాఠశాల దశలో ఏర్పడిన స్నేహం ఎల్లప్పుడూ ఉంటుందని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎల్లవేళలా మేము ఉంటు సహకరించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తమకు విద్యా బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో లోయోలా హై స్కూల్ కరస్పాండెంట్ సుందర్ రాజు, ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, అశోక్, గోపాల్ రెడ్డి, మహమ్మద్ ఫరీద్, నర్సిరెడ్డి 2007 2008 సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top