దెందులూరు నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో భారీగా సాగిన తిరంగ ర్యాలీ

Spread the love

దెందులూరు నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో భారీగా సాగిన తిరంగ ర్యాలీ

హోరెత్తిన వందేమాతర నినాదంతో ఉప్పొంగిన దేశ భక్తితో దెందులూరు నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో భారీగా సాగిన తిరంగ ర్యాలీ – పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు , అధికారులు , ప్రజలు

– ఆపరేషన్ సింధూర్ లో భాగం అయిన భారత త్రివిధ దళాలకు అభినందనలు అర్పిస్తూ ఆదివారం సాయంత్రం దెందులూరు లో 140 అడుగుల జాతీయ పతాకంతో భారీగా జరిగిన తిరంగా ర్యాలీ

– భారత సైన్యంలో సేవలు అందించిన మాజీ ఆర్మీ అధికారులను ఘనంగా సన్మానించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

– ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ పెహల్గాం ఘటన ఎంతగానో దేశ ప్రజలను బాధపెట్టిందని తెలిపారు. గతంలో ఫ్లైట్ హైజాక్ సహా ఎన్నో టెర్రరిస్టు దాడులను భారత దేశం ఎదుర్కొందని, ఈసారి జరిపిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలు సైతం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చేలా జరిగిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కేవలం పాకిస్థాన్ లోని టెర్రరిస్టు స్థావరాలు పై మాత్రమే భారత సైన్యం దాడులు చేసిందని, పాకిస్తాన్లోని సామాన్య పౌరులను ఎక్కడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరపలేదని, పాక్ దాడుల నుంచి భారత సైన్యం భారత పౌరులకు పూర్తి రక్షణ అందించిందని, అందుకు సంఘీభావం గానే రిటైర్డ్ ఆర్మీ అధికారులును కూడా ఘనంగా సన్మానించి వారికి అభినందనలు తెలపడం జరిగిందని, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు తెలిపారు..

ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పెహల్గాం లో టెర్రరిస్టులు చేసిన ఘాతుకాన్నీ కేంద్రంలోని NDA ప్రభుత్వం సీరియస్ గా తీసుకునీ, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని 9 టెర్రరిస్టు స్థావరాలపై భారత వాయుసేన దాడి చేస్తే… పాకిస్తాన్ మన దేశ సామాన్య పౌరులే లక్ష్యంగా డ్రోన్ దాడులకు కాల్పులకు తెగబడింది. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో మన భారత రక్షణ వ్యవస్థ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టాయి.. అంతే కాకుండా మన భారత వాయుసేన పాక్ లోని వైమానిక స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసిందనీ ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు.. ఒకవైపు మన దేశ పౌరులకు రక్షణ కల్పిస్తూ మరోవైపు శత్రుదేశం పై భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా దాడులు చేసిన నేపథ్యంలో మన భారత సైన్యానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి సంఘీ భావంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలోనీ కూటమి పార్టీల ఆధ్వర్యంలో దెందులూరులో తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగిందినీ అన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా రూపొందుతుందనీ , దేశ సమగ్రత కోసం, రక్షణ కోసం ప్రధాని మోదీ  తీసుకునే ప్రతి నిర్ణయాలకు యావత్ దేశం మొత్తం ఈరోజు మద్దతుగా నిలుస్తుంది. ఈ సందర్భంగా పాక్ జరిపిన దాడుల్లో వీర మరణం పొందిన మన భారత జవాన్లకు నివాళి అర్పిస్తున్నాం అని, అదేవిధంగా భారత త్రివిధ దళాలలో తమ సేవలు అందించిన మాజీ ఆర్మీ ఉద్యోగులను, సిబ్బందిని కూడా ఈ సందర్భంగా దెందులూరు లో ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలపడం జరిగిందని, దేశ సమైక్య స్ఫూర్తిని , సమగ్రతను దెబ్బతీసే ఏ అంశాలను కూడా అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమీ ప్రభుత్వం ఉపేక్షించదని, దేశం కోసం, రాష్ట్రం కోసం సర్వకాల సర్వావస్థల యందు ఎలాంటి సేవకైనా కూటమి పార్టీల తరఫున తామంతా సిద్ధంగా ఉన్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది , ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top