శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమము నందు హన్షు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం.
శ్రీ సత్య సాయి జిల్లా అమడుగురు మండలం గుండువారిపల్లి పంచాయతీ గాజులపల్లి గ్రామం కూడలిలో ఉన్నటువంటి శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమము నందు కదిరి వాస్తవ్యులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి (ఎంప్లాయ్) అయినటువంటి నరేంద్ర మరియు జోష్ణ ముద్దుల కుమార్తె హన్షు (9) పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ హన్షు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖంగా, ఆనందంగా, ఉండాలని ఆశ్రమం తరఫున వృద్ధుల తరఫున కోరుకుంటున్నామని తెలియజేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube