ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.దసరా నుంచి మరో పథకం అమలు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది.సామాజిక పింఛన్లు,అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు.డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోంది దసరా, దీపావళి కానుగా మరో రెండు కానుకలు అందజేయాలని భావిస్తున్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి అందించే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కూడా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 826 రూపాయలు ఉంది. ఒక్కో కుటుంబానికి ఏడాది మూడు ఉచిత సిలిండర్లు అంటే ఒక కుటుంబానికి ఏడాది 2,478 రూపాయల లబ్ధి చేకూరుతుందని అర్థం. ఈ లెక్కన రాష్ట్రంలో 1.55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వంపై 3,640 కోట్ల భారం పడబోతోంది దసరా నుంచి ఉచిత బస్ పథకం ఏపీఎస్ ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ హామీని దసరా నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యంపై స్టడీ చేసింది. మహిళలకు ఉచిత బస్ పథకాన్ని ఎలా అమలుచేయాలని ఏ ఏ బస్‌లో ఈ స్కీమ్ ప్రవేశ పెట్టాలనేది ఇప్పటికే డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది. అయ్యే ఖర్చు ఎంత లాంటి సమగ్ర వివరాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
