రైతు గుర్తింపు నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

Spread the love

రైతు గుర్తింపు నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి — వ్యవసాయ అధికారి గిరిబాబు

(NTODAY NEWS)

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో పలు గ్రామాలలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో ఉన్న సుంకనపల్లి, ఆరెగూడెం, చిన్నకాపర్తి, శివనేనిగూడెం, ఉరుముడ్ల గ్రామాలలో ఐదుగురు ఏ ఈ ఓ లతో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గిరిబాబు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులలో, బోర్లు ఎండిపోయే విధంగా ఉండే అటువంటి వ్యవసాయ రైతులకు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క పట్టా పాస్ బుక్ కలిగిన రైతులు రైతు గుర్తింపు నెంబర్ పొందటానికి ఏ ఈ ఓ లను సంప్రదించాలని రైతు గుర్తింపు నెంబరు లేని రైతులకు కేంద్ర ప్రభుత్వం పథకాలు పీఎం కిసాన్ యోజన వంటి వర్తించవని తెలియజేశారు ఈ గుర్తింపు నెంబర్ కోసం ఏ ఈ ఓ లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు వీణ, మనీషా, శశాంకలు , పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top