క్రొత్త వంటపాత్రలను బహుకరించిన ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు
సద్గురు శ్రీ షిరిడి సాయిబాబావారు భక్తులు
ప్రతి గురువారం నిర్వహించు అన్నదాన కార్యక్రమానికి. క్రొత్త వంటపాత్రలను బహుకరించిన ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ.వారు వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతూ.ఎంతోమందికి ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని ఫ్రెండ్స్ యూనిటీ సెంటర్ రామాలయ కమిటీ సభ్యులు కోరారు. స్థానిక 40 వ డివిజన్లో వేంచేసి ఉన్నశ్రీ భద్రాద్రి సీతారాములవారి ఆలయంలో.ఉపాలయంగా ఉన్న శ్రీ శ్రీ సద్గురు షిర్డీ సాయినాధునికి స్థానికంగా ఉన్న మహిళా భక్తులు స్వయంగా వంటలు తయారుచేసి. గత 12 సంవత్సరాలుగా ప్రతి గురువారం మధ్యాహ్నం పూట 100 మందికి పైగా పేదలు,అనాధలకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు.వంటలు చేయడానికి ఉపయోగించే పాత్రలు పాడైపోవడంతో ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త శ్రీ ముదుండి విద్యాసాగర్ వర్మ-శ్వేతా దంపతులు ముందుకు వచ్చి 30వేల రూపాయలతో వంట పాత్రలు కొత్తవి కొనుగోలుచేసి సాయిబాబా వారి మహిళా భక్తులకు ఆదివారం రామాలయం ప్రాంగణంలో అందజేశారు.ఈ సందర్భంగా వర్మ దంపతులను బాబా భక్తులు శాలువా కప్పి సన్మానించి,మామిడి పండ్లు అందజేశారు.వర్మ దంపతులు ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో,నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరారు.వర్మ చేస్తున్న వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని రామాలయం కమిటీ,సాయిబాబా భక్తులు వర్మ-శ్వేతా దంపతులను దీవించారు.