BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

చింతలపూడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ తనిఖీ నిర్వహించారు

తెలంగాణ
09 May, 2025 - 07:07 AM
337 వీక్షణలు
చింతలపూడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ తనిఖీ నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, చింతలపూడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలలో భాగంగా స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా చింతలపూడి పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ కి గౌరవ వందనం సమర్పించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు "స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర" కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.స్టేషన్‌లో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను సమీక్షించి, పరిపాలనా విధానాలను మెరుగుపరిచేలా మార్గదర్శకాలు అందించారు.మండల పరిధిలోని ప్రతి గ్రామ సమస్యలను అధికారుల ద్వారా వివరంగా అడిగి తెలుసుకున్నారు.గ్రామాల్లో చిన్న సమస్యలు తలెత్తిన వెంటనే అధికారులే పరిష్కారం చేసేందుకు ముందడుగు వేస్తే, భవిష్యత్తులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉంటుంది అని స్పష్టం చేశారు.మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు.డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ ద్వారా నేరాలను గుర్తించి, ట్రాఫిక్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని,హైస్కూల్, కాలేజీలు, రద్దీ ప్రదేశాలలో "శక్తి యాప్" పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.మహిళలు మరియు బాలికలు ఈ యాప్ ఉపయోగించడం ద్వారా సురక్షితంగా ఉండేలా వారిలో విశ్వాసం పెంపొందించాలని,ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై తక్షణ చర్యలు తీసుకొని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని,అధికారులు సమిష్టిగా పనిచేస్తూ రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని,ప్రజలకు సీసీటీవీల వినియోగంపై అవగాహన కల్పించి, స్టేషన్ల పరిధిలోని వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, రహదారులు, ప్రజా ప్రదేశాల్లో సీసీటీవీ ఏర్పాటు చేయడం వల్ల దర్యాప్తుకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేయాలని కోరారు ఈ తనిఖీ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు అందించి, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం అంశాల్లో మరింత ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఆపరేషన్ సింధూరం పురస్కరించుకుని ఎటువంటి అసత్య ప్రచారాలు లేకుండా చూడాలని, అన్ని ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలన చేయాలని కొత్త వ్యక్తుల కథలు పై నిఘా ఉంచాలని వాట్సప్ ద్వారా జరిగే ప్రచారాలపై ఏదైనా అనుమానాస్పద ప్రచారాలు జరిగితే వాటిపై వాటి యొక్క అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైన సమయంలో ప్రజలు వారి యొక్క ప్రాణాన్ని ఎలా సంరక్షించుకోవాలనే విషయాలపై మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డిఎస్పి యు రవిచంద్ర చింతలపూడి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ చింతలపూడి ఎస్సై కుటుంబరావు మరియు పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా చింతలపూడి పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ సింగ్ ఈ మెగా రక్తదాన శిబిరంలో ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క రక్తాన్ని దానం చేసిన దానిపై ప్రజలను అభినందించిన జిల్లా ఎస్పీ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో మేలని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వలన ఆపద సమయంలో ఉన్నటువంటి ప్రజలకు పునర్జన్మ ప్రసాదించిన వారు అవుతారని ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ప్రోత్సహించాలని తల సేమియా వ్యాధిగ్రస్తులు నిత్యం వారి యొక్క రక్తం తగ్గిపోవడం వలన మీరిచ్చే రక్తమే వారికి ప్రాణాలను నిలబెడుతుందని గ్రహించాలని తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube