ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని గుజ్జ గ్రామపంచాయతీ పరిధిలో మండల కేంద్రంలోని శ్రీ కాకతీయ స్కూల్ విద్యాసంస్థలో ఆ విద్యాసంస్థ చైర్మన్ జ్యోతి శ్రీనివాస్, ఇంచార్జ్ వీరమల్ల నవీన్ కుమార్, ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాల్లో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ.. పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని వారు అన్నారు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పాఠశాల ప్రాంగణంలో ఆటపాటలతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను ముత్యాలమ్మ దేవాలయ సమీపంలో గల పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాకతీయ స్కూల్ ఉపాధ్యాయులు కళ్యాణి, సంతోష, మాధవి, నందిని, గిరిజ, ప్రియాంక, నాగబాల, అశ్విని విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
