శ్రీసాత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశలే లక్ష్యంగా జనసేన శ్రేణులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి – భైరవ ప్రసాద్.
NTODAY NEWS: రిపోర్టర్ కదిరి నియోజకవర్గం వినోద్ కుమార్
మన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలను అనుసరిస్తూ కదిరి R&B భవనం నందు కదిరి పట్టణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి “కదిరి పట్టణంలో జనసేన పార్టీ కోసం , పార్టీ బలోపేతం కోసం కదిరి పట్టణము 36 వార్డులలో పార్టీ బలోపేతం కోసం శ్రమించే చురుకైన 5 లేదా 6 మంది కార్యకర్తల పేర్లు పార్టీ ఆఫీసుకు పంపుట కొరకు తర్వాత ప్రతి వార్డుకూ 20 మందితో కలిపి ఒక కమిటీ వేసి రాబోయే స్థానిక సంస్థల మరియు మునిసిపల్ ఎన్నికలకు సమాయత్తం అవ్వాలని మన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా NDA కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి మరింత చేరువ చేస్తూ ఇది మంచి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అనే విధంగా గ్రామస్థాయిలో, పట్టణ స్థాయిలో జనసేన క్యాడర్ బలోపేతం కోసం కృషి చెయ్యాలని పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు కాయల చలపతి , ఉపాధ్యక్షులు లక్ష్మణ కుటాల, ప్రధాన కార్యదర్శులు కిన్నెర మహేష్ , అంజిబాబు, గుంతా ప్రతాప్, కార్యదర్శులు లోకేష్, ఇనోద్దీన్,రాజేంద్ర ప్రసాద్, హరీష్ వాల్మీకి, గంగరాజు, రాజా రామ్, రాజా, చంద్రశేఖర్, ఐటి కో ఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్, నాయకులు చిన్నప రెడ్డి, మనోహర్, కాకర్ల రామచంద్ర, తుమ్మల రవి, సోము, సాయిప్రియా, జయశ్రీ, చక్రి, కిషోర్, పవన్, హరిబాబు, చంద్రశేఖర్, సలీం, బాబ్జాన్, బాలు, శివ కుమార్, మహేష్, సుదర్శన్, నరసింహులు తదితర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పాల్గొన్నారు.

