ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య
NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో పాఠశాలలు పున ప్రారంభంలో భాగంగా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో,రంగు రంగు బెలూన్ లతో స్వాగతం తోరణాల తో సిద్ధం చేశారు. పెద్ద కాపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం రోజున వచ్చే విద్యార్థిని , విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హెచ్.ఎం భవాని మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులందరికీ నూతన విద్యా సంవత్సరం ప్రారంభ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విద్య సంవత్సరం గత సంవత్సరం కంటే అద్భుతంగా నడవాలని , విద్యార్థులు మంచి విజయాలు నమోదు చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే విదంగా ఉన్నరని జిల్లా కలెక్టర్, డీఈవో ఆదేశాల మేరకు ముందస్తుగా ఏప్రిల్ నెల నుండే బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలోని వసతులు, నాణ్యమైన విద్య గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు. తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. గతంలో కన్న ఈ సంవత్సరం విద్యార్థులు ఎక్కువ చేరే అవకాశం ఉందన్నారు. మేము నిర్వహించిన బడిబాట కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. పిల్లల తల్లితండ్రులు సుముకంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , మహిళ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.

