BREAKING
బీబీనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుక డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గౌడ సంఘం సంఘీభావం ఘనంగా బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బి ర్.అంబేద్కర్ జయంతి వేడుకలు. బీబీనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు మల్యాల గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో డా||బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు ​మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ​మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి బీబీనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుక డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గౌడ సంఘం సంఘీభావం ఘనంగా బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా.బి ర్.అంబేద్కర్ జయంతి వేడుకలు. బీబీనగర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు మల్యాల గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో డా||బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు ​మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ​మంచిర్యాల ఐబీ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నకిరేకల్‌లో జార్జి రెడ్డి వర్ధంతి
www.ntodaynews.com

భూ సమస్యలు ఉన్న ప్రతి రైతుకు భూ భారతి చట్టం వరం

తెలంగాణ
28 Apr, 2025 - 08:50 AM
82 వీక్షణలు
భూ సమస్యలు ఉన్న ప్రతి రైతుకు భూ భారతి చట్టం వరం-- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు N TODAY NEWS: మోట కొండూరు మండలం, ఏప్రిల్ 28 సామాన్యులకు చట్టాలు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశ్యం తో ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం మోటకొండూరు మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం రైతులకు వరం అన్నారు. భూభారతి పై రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని , భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు . భూభారతి చట్టంలో వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ భద్రత నిచ్చేందుకు ప్రభుత్వం అనేక అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. భూభారతి చట్టం రైతుల భూములకు భరోసా కల్పిస్తుందన్నారు. ధరణిలో పరిష్కారం కాని భూ సమస్యలు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. ప్రతి మనిషికి ఆధార్ మాదిరిగానే ప్రతి ఒక్కరి భూమికి రానున్న రోజుల్లో ప్రభుత్వం భూధార్ కార్డులు అందిస్తుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులు భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను సులభతరంగా పరిష్కరిస్తారని అన్నారు. ఇక పై భూ సమస్యలనేవి ఉండవని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా అందించడంతోపాటు భూ సమస్యల పరిష్కారానికి రెండు అప్పీల్ వ్యవస్థ ఉంటుందని ఆర్డీఓ పరిధిలో కాకపోతే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించుకునేందుకు ఈ చట్టం లో అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణ రెడ్డి, సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube