చిట్యాల ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో 65వ జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ సంబంధించిన అండర్ పాసింగ్ బస్టాండ్ సమీపాన మరియు హై స్కూల్ దగ్గర్లో ప్రజలకు సౌకర్యం కోసం ఇవ్వాలని కోరుతూ. బుధవారం రోజున కేంద్ర మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జి అండర్ పాస్ విషయం పై చిట్యాల పట్టణ బిజెపి పార్టీ నాయకులు వ్యాపారస్తులు కలిసి రెండు రోజుల క్రితం వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి రీజనల్ ఆఫీసర్ శివకుమార్ తో ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావుతో లైవ్ ఓవర్ అండర్ పాస్ గురించి మాట్లాడడంతో RO మరియు PD బస్టాండ్ దగ్గరలో వనిపాకల రోడ్డు దగ్గర్లో ఫ్లై ఓవర్ అండర్పాస్లను ఇస్తానని మాట ఇచ్చిన అధికారులతో బుధవారం బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతుండగా నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు హైదరాబాద్ నుండి నల్గొండ వెళుతుండగా కాసేపు ఆగి వేగవంతంగా జరుగుతున్న పనుల ను చూసి అధికారులతో బిజెపి జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్ అధికారులు హామీ ఇచ్చినట్లుగా మరి అండర్ పాస్ ఎలా ఏర్పాటు చేస్తారని ఇక్కడ చూస్తే శరవేగంగా ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని మరి మీరు పనులు కొనసాగిస్తూ మరి అండర్పాస్ బస్టాండ్ వద్ద ఎలా ఇస్తారు అని మాట్లాడడంతో RO మరియు PD మాట్లాడుతూ మేము కాంట్రాక్టర్లతో డిజైన్ మార్చే విషయం పై మాట్లాడడం జరుగుతున్నది రెండు మూడు రోజుల్లో డిజైన్ మార్చి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామని తప్పనిసరిగా రెండు అండర్పాసులు ఇస్తామని అధికారులు తెలియజేయడం జరిగినది వివరాలు తెలుసుకున్న వారిలో చిట్యాల పట్టణా బిజెపి నాయకులు భానుక కందాటి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.