చీకటిమామిడి వాల్ తండా నుండి చౌదర్ పల్లి రోడ్డు కోసం బీజేపీ నాయకుల ధర్నా, అరెస్టులు
N TODAY NEWS: బొమ్మలరామారం,
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, చీకటిమామిడి (వాలు తండా) నుండి చౌదర్‌పల్లి కరెంట్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక బీజేపీ నాయకులు,అఖిలపక్ష నాయకులు,మరియు గ్రామ ప్రజలు సోమవారం రోజున రహదారిపై ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వచ్చే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని తండాల వైపు రానివ్వమని నినాదాలు చేశారు.మండల బీజేపీ అధ్యక్షుడు మాలోత్ వినోద్ నాయక్ మాట్లాడుతూ, చీకటిమామిడి (వాలు తండా) నుంచి గోవిందా తండా,కెకె తండా, చౌదర్‌పల్లి,మర్యాల కరెంట్ జంక్షన్ మీదుగా వెళ్లే ఈ రహదారిపై అనేక గుంతలు ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఈ రోడ్డుపై వాలు తండా, గోవిందు తండా,లక్క తండా,చొప్పరి చెట్టు తండా,కెకె తండా,చౌదర్‌పల్లి పరిధిలోని ఆరు తండాల ప్రజలు,వాహనదారులు నిత్యం ప్రయాణిస్తుంటారని అన్నారు గత ప్రభుత్వం ఈ రోడ్డు పనులను పట్టించుకోలేదని, కనీసం ఈ ప్రభుత్వంలోనైనా సమస్య పరిష్కారమవుతుందని ఆశించామని వినోద్ నాయక్ అన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసుల జోక్యం,నాయకుల ఆగ్రహం శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ అరెస్టులతో తమ నిరసన ఆగదని,రోడ్డు సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని,తండాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారని నినాదాలు చేశారు.ఈ రోడ్డు సమస్యపై ఇప్పటికే ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు,ఆర్ అండ్ బి అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదని వారు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, దేవ్ సింగ్,గోవింద్,బాలాజీ, ఇంద్రవత్ రాజు, శేఖర్, నరేష్ నాయక్, నెహ్రు, శ్రీకాంత్, గ్రామ యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

