*అమెరికా ‘షట్‌డౌన్’ ఎత్తివేత..? NTODAY NEWS: ప్రత్యేక కథనం ఎం. కోటేశ్వరరావు అక్టోబరు ఒకటవ తేదీ నుంచి అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్ ప్రభుత్వ మూత ( షట్‌డౌన్ )ను ఎత్తివేసేందుకు ఆదివారం నాడు నాంది పలికారు. మూత 41వ రోజు సోమవారం నాడు ఎనిమిది అంశాలపై పార్లమెంటు ఎగువ సభ సెనెట్‌లో తీర్మానాలు ఆమోదం పొందాయి. బుధవారం నాడు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ ముందుకు వచ్చిన తరువాత చేసే తీర్మానంతో అధికారికంగా ప్రభుత్వ మూతకు తెరపడుతుందని భావిస్తున్నారు. […]
శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..!
శాంతిదూత నోట విధ్వంసపు మాటలా..! -గంట రాజు NTODAY NEWS:అమెరికా అణ్వస్త్రాలకు సంబంధించిన అంశాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్ఢ్ ట్రంప్ తాజాగా తెరపైకి తెచ్చి, ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర చర్చకు శ్రీకారం చుట్టారు. అమెరికాకు ప్రమాదకరమని భావిస్తున్న దేశాలపై గత కొద్ది నెలలుగా సుంకాలతో ఇబ్బంది పెట్టడానికి ట్రంప్ ప్రయత్నించారు. ఆ ఎత్తుగడ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో, అణ్వస్త్రాల అంశాన్ని లేవనెత్తి; కొత్త పద్ధతిలో బ్లాక్‌మెయిల్ చేయడానికి సంకల్పించినట్టుగా అర్థమవుతుంది. భారతదేశంతో పాటు మరిన్ని దేశాలను సుంకాలతో […]
సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ విజయ దుందుభి!
సోషలిస్టు జోహ్రాన్ మమ్దానీ విజయ దుందుభి! -ఎం. కోటేశ్వరరావు NTODAY NEWS: ప్రత్యేక కథనం 2025 జూన్ 24న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వేలో ప్రత్యర్ధుల కంటే ముందున్న జోహ్రాన్ మమ్దానీ నవంబరు 4న జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు 91శాతం పూర్తయిన సమయానికి 50.4శాతంతో ముందుండి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. ప్రత్యర్ధిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి పరాజయం పాలై, పార్టీ మీద […]
అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్ మస్క్ కూడా వేస్టే
మన్సా మూసా .. క్రీ.శ. 1312 నుంచి 1337 మధ్య ఆయన పాలనలో ఆఫ్రికాలోని మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ఈయన ఒక రాజు మాత్రమే కాదు.. మహా చక్రవర్తి. అంతేనా..మహాబలుడు కూడా. ఇంకా చెప్పాలంటే.. ఆయన సంపద ప్రస్తుతం లెక్కిస్తే 400 బిలియన్ల డాలర్లు. అంటే ప్రస్తుతం విశ్వకుబేరుడిగా పేరున్న ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఆయన దగ్గర ఉండేది. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటి వరకు లేరు.









