రాయికల్ మున్సిపాలిటీగా ఏర్పడ్డ తరుణంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ తో నిర్మాణాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నావని ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేపట్టనున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.ఇంటి నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి చేరగా రాయికల్ మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం తనిఖీచేసారు.నివాస యోగ్యానికి ఉన్న ప్లాట్ లలో బఫర్ జోన్ పేరుతో మాస్టర్ ప్లాన్లు ఎలా కేటాయించారని కమిషనర్ జగదీశ్వర్,టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్ ను ప్రశ్నించారు.మాస్టర్ ప్లాన్ మార్పుకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేపట్టామని గతంలోని ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు.ఇంటి నిర్మాణాలకు గత గ్రామపంచాయతీ లోనే కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాలలో మున్సిపాలిటీ ప్రకటనతో రాయికల్ పట్టణ పరిధిలో మాస్టర్ ప్లాన్ పేరుతో ఇండస్ట్రియల్,గ్రీన్ బెల్ట్,ట్రాన్స్ పోర్ట్ మరియు కమ్యూనికేషన్,వాటర్ బాడీస్ జోన్ లు ఏర్పాటుతో ప్రజలకు ఇంటి అనుమతులు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటి అనుమతుల్లో ఇబ్బందులు లేకుండా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలన్నారు.గతంలో మాస్టర్ ప్లాన్ మార్పుకు ప్రతిపాదించిన తీర్మానము పత్రాలను అందిస్తే ప్రభుత్వానికి నివేదిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు,కౌన్సిలర్ మ్యాకల అనురాధ రమేష్,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,నాయకులు కొయ్యేడి మహిపాల్ రెడ్డి,ఎద్దండి దివాకర్, బాపురపు నర్సయ్య,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్,కడకుంట్ల నరేష్, ఇంతియాజ్,మండ రమేష్,రాజీవ్,శివ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply