కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డ్ అందుకున్న సీఐ చంద్రబాబును అభినందించిన రాచకొండ సిపి
NTODAY NEWS: రాచకొండ సిపి కార్యాలయం
కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డు అందుకున్న యాదాద్రి భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు నగరిని రాచకొండ సిపి జి.సుధీర్ బాబు ఐపీఎస్, కమీషనర్ సిపి ఆఫీస్ నేరేడ్మెట్ లో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిన్ని అవార్డు అందుకుని రాచకొండ కమిషనరేట్ కి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులలో విశిస్ట సేవలు అందించినందుకు గాను యాదాద్రి భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్ అవార్డ్ అందుకున్నారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. 1.స్పెషల్ ఆపరేషన్స్, 2.ఇన్వెస్టిగేషన్,3.ఇంటలిజెన్స్, 4.ఫోరెన్సిక్ సైన్స్ లలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ హోమ్ అఫైర్స్ వారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (తేదీ: 31.10.2025) సందర్భంగా ఈ ‘కేంద్రీయ గృహమంత్రి దక్షత పథక్’ అవార్డ్స్ ప్రకటించారు.గతంలో ఈ నాలుగు విభాగాలకు నాలుగు వేర్వేరు అవార్డులు 1.స్పెషల్ ఆపరేషన్ మెడల్, 2.యూనియన్ మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్, 3.అసాధారణ ఆసూచన కుశలత పథక్, 4.యూనియన్ మినిస్టర్ అవార్డ్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్,పేర్లతో ఉండగా, ఫిబ్రవరి-2024 లో నాలుగు అవార్డులను కలిపి ఒకే అవార్డ్ పేరిట ఇవ్వాలని నిర్ణయించారు ఈ సంవత్సరం తమ విధి నిర్వహణలో అత్యంత సమర్ధతతో డ్యూటి చేసిన IG స్థాయి అధికారి నుండి కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు మొత్తం 1466 మంది పోలీసు అధికారులకు భారత ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించినది. ఇందులో పహల్గామ్ ఉగ్ర దాడికి తెగబడిన ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత సైన్యం, భద్రతా దళాలు,జమ్మూ పోలీసులు సంయుక్తంగా చేపట్టి విజయం సాధించిన ‘ఆపరేషన్ మహాదేవ్’ లో పాలుపంచుకున్న కాశ్మీర్ రేంజ్ IG వి.కె.బిర్డీ, శ్రీనగర్ సీనియర్ SP జీ.వీ.సందీప్ చక్రవర్తి లతో సహా 19 మంది జమ్మూకాశ్మీర్ పోలీసులు ఈ అవార్డ్ గ్రహీతలలో ఉన్నారు.
మన తెలంగాణా రాష్ట్రం నుండి ఎంపికైన అధికారులు ఇన్స్పెక్టర్లు:
చంద్రబాబు నగరి,భువనగిరి రూరల్ సిఐ,(రాచకొండ కమిషనరేట్)ఉపేందర్ రావు జాల, ఇన్స్పెక్టర్, సైబరాబాద్, తిరుపతి వాసాల, ఇన్స్పెక్టర్, సిఐ సెల్, నేర పరిశోధనలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎన్నికైనారు. అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ విభాగంలో సిఐ సెల్ కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు 1.ఏ.లక్ష్మణ్ రావు, 2.జి.జాకబ్ లు ఈ అవార్డుకు ఎన్నికయ్యారు.

