దళితుల ఇంటి స్థలాల భూమిని కాపాడాలి,సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం
NTODAY NEWS:యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం
యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలం,గోపాలపురం గ్రామంలో దళితులకు చెందిన ఇంటి స్థలాలను ఫీల్డ్ అసిస్టెంట్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆ గ్రామ దళితలతో కలిసి కలెక్టరేట్ లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావుకి ప్రజావాణిలో సోమవారం రోజున వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గోపాలపురం గ్రామానికి చెందిన దళితులకు సంబంధించిన ఇంటి స్థలాలపై విచారణ చేసి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాళ్ళ స్థలాలను వారికి ఇవ్వాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండి ఇమ్రాన్, తుర్కపల్లి సిపిఐ మండల కార్యదర్శి సిలువేరు దుర్గయ్య, మండల సహాయ కార్యదర్శి గుంటుపల్లి సత్తయ్య, నాయకులు వల్లపు భగవంతు, గోపాలపురం చెందిన బాధితులు కాశబోయిన పెద్దులు, మోత్కుపల్లి నరసింహులు, గడ్డ కింది రామయ్య, మోత్కుపల్లి రాములమ్మ, అయ్యగళ్ళ హేమలత, మోత్కుపల్లి మల్లమ్మ, మోత్కుపల్లి పోచమ్మ, మోత్కుపల్లి రేణుక,కొండమడుగు సునీత,మోత్కుపల్లి సావిత్రి, మునిగడప యాదమ్మ, మోత్కుపల్లి సుగుణ, బాలమణి, రాజయ్య, దుర్గమ్మ, బాలేష్ తదితరులు పాల్గొన్నారు.

