సమాజ సంక్షేమం కోసమే ఈ అవగాహన సదస్సు.: ఎస్పీ కంచి శ్రీనివాసరావు.
అనధికార వెబ్సైట్లు ను వినియోగించకపోవటమే ఉత్తమం.::సైబర్ క్రైమ్ కౌన్సిలర్ ” కొత్తపల్లి ప్రదీప్
పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని ఏఎం రెడ్డి, ఎన్.ఈ. సి, ఎం.ఐ.ఎం, ఈశ్వర్ మరియు టి.ఇ.సి ఇంజనీరింగ్ కళాశాలు
వాసవి, కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో గత కొద్ది రోజులుగా సైబర్ క్రైమ్ ఫై విద్యార్థినీ విద్యార్థులకు ఆవాహన సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది.ఈ
కారిక్రమంలో ముఖ్య అతిధిగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ అవగాహన సదస్సు పల్నాడు జిల్లా పోలీస్ విభాగం,సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో సమాజ సంక్షేమం కోసం,సైబర్ నేరాలపై అవగాహన నిర్వహించారు అని తెలిపారు.విద్యార్థినులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని సూచించారు.
అనంతరం సైబర్ క్రైమ్ కౌన్సిలర్ ” కొత్తపల్లి ప్రదీప్ మాట్లాడుతూ ఆనధికార వెబ్సైట్లును వినియోగించకుండా,మొబైల్ యాపూలు డౌన్లోడ్ చేసేటపుడు వచ్చే పర్మిషన్ లు, మెసేజ్ లు, ఓటిపిలు వంటివి వచ్చినపుడు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుడ్ టచ్,”బ్యాడ్ టచ్ , స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహన తోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.ఏదైనా అనుమానస్పదంగా అనిపించినప్పుడు ఇలాంటివి ఆపటానికి సైబర్ క్రైమ్ వెబ్సైటులులో ఫిర్యాదు చేయవచ్చున్నారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట వన్ టౌన్ సి.ఐ చరణ్,వన్ టౌన్ ఎస్సై అరుణ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐ వెంకటేశ్వర్లు ఏ.ఎస్ ఐ మహేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.