పెద్ద కాపర్తి వాసి చేకూరి గణేష్ కు దళితరత్న అవార్డు
NTODAY NEWS: నల్గొండ జిల్లా స్టాఫ్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఉన్న పెద్దకాపర్తి గ్రామానికి చెందిన చేకూరి గణేష్ దళిత రత్న అవార్డు అందుకున్నారు. గత రెండు దశాబ్దాలకు పైగా ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఉద్యమంలో ఎంఎంఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి నుండి మొదలైన ప్రస్థానం మండలం డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసే వివిధ జిల్లాలకు ఇంచార్జీగా జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎస్సీ వర్గీకరణ సాధన లో క్రియాశీలక పాత్ర పోషించారు. గణేష్ సేవలను కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ ల చేతులమీదుగా బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో దళిత రత్న అందజేశారు .దళిత రత్న అవార్డు రావడం పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన పోరాటానికి ఒక గుర్తింపు అని అభినందించారు .ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థి యువజన ప్రజా సమస్యలపై తన వంతు పాత్రను పోషించి పోరాటం చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ,చైర్మన్ ఇటుక రాజు మాదిగ , రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మరియు ఇప్పటి వరకు నాకు సహకరించిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పత్రికా ప్రతినిధులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.