బుడమేరు నీళ్లు సెంట్రల్ నియోజకవర్గానికి రాకుండా చర్యలు చేపట్టాం వదంతులు నమ్మవద్దు
NTODAY NEWS: విజయవాడ
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, మోందా తుఫాన్ రాష్ట్రంలో తీరం దాటబోతున్నందున, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని, ప్రజలను అప్రమత్తం చేసి, తీర ప్రాంతాల నుండి తరలించి, క్యాంపులలో కనీస సదుపాయాలు, భోజనాలు, బియ్యం, మరియు కుటుంబాలకు రూ. 3,000 నగదు అందిస్తున్నాం – MLA
తుఫాను లేదా వరదలు వచ్చినా బుడమేరు నీళ్లు సెంట్రల్ నియోజకవర్గానికి రాకుండా చర్యలు చేపట్టాం వదంతులు నమ్మవద్దు-MLA బొండా ఉమ
ధి:-28-10-2025 మంగళవారం ఉదయం విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు బంగాళాఖాతంలో ఏర్పడిన “మొంథా తుఫాన్ ” ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు…
ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ :-NDA ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు తుఫాన్ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని, గత రెండు రోజులుగా నియోజకవర్గంలో పర్యటించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను స్థానికులతో మాట్లాడి తెలుసుకుంటున్నాం అని…
‘మొంథా’ తుఫాన్ ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజులు జిల్లాలో విస్తారంగా వర్షాలు, ఈదురు గాలులు సంభవిస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వర్షంతో పాటు ఈదురు గాలులకు చెట్లు కూడా పడే అవకాశం ఉందని, చెట్లకు సమీపంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల వేర్లతో పాటు సమీపంలో ఉన్న రాళ్లు కూడా జారి పడే అవకాశం ఉంటుందని, వర్షాలు తగ్గేంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కోరారు.
తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో అనేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు, ముందు చూపుతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని..
“మొంథా” తుఫాను ప్రాంతాల ప్రజలకు సురక్షిత ఆశ్రయం, సత్వర సాయంగా ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లోని వారికి రూ.3000 నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసరాల పంపిణీ చేయనున్నం అని, సహాయ కార్యక్రమాల్లో రెండురోజులుగా MLA లు, MP లు, మంత్రులు కూటమి శ్రేణులు పాల్గొంటున్నాం అని,, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని…
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని, ముఖ్యంగా విజయవాడ నగరంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అని…
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, కలెక్టర్, నగరపాలక కమిషనర్, ఎమ్మెల్యేలు వెంటనే అప్రమత్తమై, ఈరోజు షాపులకు సెలవు ప్రకటించాం, స్కూళ్లకు రెండు రోజుల సెలవులు ప్రకటించాం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశాం అని, రాత్రికి తీరం దాటబోయే తుఫాన్ వల్ల 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు అని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని,ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సరం బుడమేరు వరదల వదంతులు ఎక్కువగా వస్తున్న తరుణంలో, ఈసారి తుఫాను లేదా వరదలు వచ్చినా బుడమేరు నీళ్లు నియోజకవర్గానికి రాకుండా చర్యలు చేపట్టాం అని వదంతులు నమ్మవద్దు అని…
పునరావస కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని సెంట్రల్ నియోజకవర్గంలోని కమ్యూనిటీ హాల్స్, ప్రభుత్వ పాఠశాలలలో ఏర్పాటు చేశామని అత్యవసర సమయాలలో అధికారులతో ప్రజలు సహకరించాలని బొండా ఉమా గారు తెలియజేశారు…

