కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు

Spread the love

భూభారతిలో న్యాయం జరగాక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతు

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవిన్యూ భూభారతి ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన విషయం అందరికీ తెలిసిందే కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో తనకు న్యాయం జరగలేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రోజున నిర్వహించే గ్రీవెన్స్ డే లోపెట్రోల్ పోసుకొని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం రేపుతుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలం,నాగినేనిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 340,345,346 లో 2.20 గంటల భూమిని 2007వ సంవత్సరం రిజిస్టర్ దస్తావేజు నంబర్:2226/2005 ద్వారా నాగినేనిపల్లి గ్రామంలో అప్పటి పట్టాదారుడైన చీమల లింగం దగ్గర తడకపల్లి ఆగి రెడ్డి అనే నేను (రైతు) కొనుగోలు చేశామని తెలిపారు బొమ్మలరామారం ఎమ్మార్వో కార్యాలయంలో అమెండ్మెంట్ నెంబర్ 47/2007-08 ద్వారా పాత పాస్ పుస్తకాలు కూడా జారీ చేయడం జరిగిందని తెలిపారు గతంలో తేదీ 31/7/2023 నాడు ధరణి ఆన్లైన్ లో పాస్బుక్ డాటా కరెక్షన్ కు దరఖాస్తు నంబర్: 2300122422 చేసుకోవడం జరిగిందన్నారు దానిపై భువనగిరి ఆర్డీవో అధికారి వెంటనే పాస్బుక్కులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చినా కూడా ఎలాంటి విచారణ జరగకుండా దరఖాస్తును తిరస్కరణ చేయడం జరిగిందని తెలిపారు మరలా పాసుబుక్కులు కావాలని తేదీ: 3/12 /2024 నాడు ధరణి పోర్టల్ అప్లికేషన్ నెంబర్ :2400127247 ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఇట్టి దరఖాస్తు పై మండల రెవెన్యూ అధికారులు విచారణ జరిపి Lr.No.B/59/2025 తేది : 19/03/2025 నాడు జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించారని తెలిపారు రెవెన్యూ అధికారులు తప్పిదం వల్ల నా భూమి సర్వే నంబర్ విషయంలో ఎలాంటి అమ్మడం కొనడం జరగకపోయినా నాగినేనిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి పేరు మ్యానువల్ పహానిలో 2009-10,2014-15 సంవత్సరం మరియు ధరణి ఆన్లైన్ పహానిలో నమోదు కావడం జరిగిందని అని అన్నారు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మండల తాహసిల్దార్ లు 2008 సంవత్సరం నుండి వివాదాస్పదంలో ఉన్న భూమిని 19/9/2024 నాడు వరకు ధరణి ఆన్లైన్లో డిజిటల్ సైన్ లు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్, ఆర్డిఓ,బొమ్మలరామారం ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకు మమ్మల్ని బలి చేయడం సరైనది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి క్రయవిక్రయాలు జరగని వ్యక్తిని ధరణి పహానిలో పేరు చేర్చడం ఎంతవరకు సబబు అని అన్నారు ఇన్ని సంవత్సరాలు చెప్పులు అరిగేలా తిరిగిన నాకు న్యాయం జరగలేదని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డానని కన్నీటిపర్వంతమయ్యారు.

బొమ్మలరామారం తహసిల్దార్ వివరణ

నాగినేనిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్లు 340,345 346 లో 2.22 గుంటలకు సంబంధించిన భూమి తడకపల్లి ఆగిరెడ్డి మరియు సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి మధ్య భూమి వివాదం కోర్టు కేసు ఉండడంతో మేము ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండల తాహాసిల్దార్ తెలిపారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »