రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు ముగ్గు చూపాలి— వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
NTODAY NEWS
నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంను ప్రారంభించి, అనంతరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, గుత్తా అమిత్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రితుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలకరి చినుకులు పడుతూ రైతులకు మేలు చేస్తుంది అన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్న రాష్ట్రన్ని ముందుకు తీసుకుపోతున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ సాధ్యం అని అన్నారు. అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు పూర్తి స్థాయిలో చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అత్యధిక వరి పంట సాగు చేసిన జిల్లా నల్లగొండ అని పెర్కొన్నారు. రైతు భరోస రానున్న పది రోజుల రైతుల ఖాతాలో జమ చేస్తామని,త్వరలో రైతులకు ఆయిల్ ఫామ్ మిల్లును ఏర్పాటు చేస్తామన్నారు. చిట్యాల మార్కెట్ కమిటీ పరిధిలోని గ్రామాలు అన్నింటిని ఇక్కడే కలుపుతాం అని తెలిపారు నూతన పంటలు పండించేలా రైతులు ముందడుగు వేయాలని
పురుగుల మందుల వాడకం తగ్గించి రైతులంత ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు. నల్లగొండ జిల్లా అభివృధి కి తోడ్పడతాను అని ఈ సందర్భంగా తెలియజేశారు.