ఆపిటోరియా(అరబిందో )పరిశ్రమలో అగ్ని ప్రమాదం…
NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్. నవంబర్ 9
★తప్పిన ప్రాణనష్టం .
★బోరపట్ల ఆపిటోరియా యూనిట్ 1లొ చెలరేగిన మంటలు
★మంటలను అదుపు చేసిన పరిశ్రమలోని అగ్నిమపాక యంత్రాలు
★నర్సాపూర్ నియోజకవర్గ పరదిలోని హత్నూర మండలంలొ ఘటన
హత్నూర మండల పరదిలోని బోరపట్ల గ్రామ శివారులొ ఉన్న ఆపిటోరియా (అరబిందో)ఫార్మ ప్రవేట్ లిమిటెడ్ యూనిట్ 1 పరిశ్రమలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఒక్కసారిగా పరిశ్రమలో సెప్టి ఎమర్జెన్సీ సైరెన్ ను మోగించడంతో పరిశ్రమలో పనిచేసే కార్మికులు. ఉద్యోగులు ఉలిక్కిపడి పరుగులుతీశారు… ఘటన జరిగిన కొన్ని క్షణాల్లో అప్రమత్తం అయినా పరిశ్రమలోని అగ్నిమపాక సిబ్బంది.. ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని మంటలను అదుపు చేసారు..అయితే రాత్రి 10గంటల సమయంలో తమ షిఫ్ట్ మొగుంచుకొని విధులనుండి ఇంటికి బయలుదేరారరు కార్మికులు ఉద్యోగులు.. తిరిగి రాత్రి షిఫ్ట్ లొ పని చేసేందుకు కార్మికులు ఉద్యోగులు వచ్చే సమయంలో ఇ ప్రమాదం స్తంభవించిందని కార్మికులు తెలిపిన సమాచారం…అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది..పరిశ్రమ యాజమాన్యం ఇ ఘటనపై సమాచారం అందించాల్సి ఉంది..హత్నూర ఎస్ఐ శ్రీధర్ ను పత్రిక రీపోటర్స్ సంప్రదించగా. పరిశ్రమ ప్రతినిధులు ఎవరు స్పందించడం లేదని తెలిపారు… పరిశ్రమలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు అక్కడకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు.. పరిశ్రమలొ ఇప్పటికే ఎన్నో ఘటనలు జరిగినప్పటికీ ఇట్టి సమాచారం బయటకు వెళ్లకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు..
ఉద్యోగులకు కార్మికులకు భద్రత ఫై అవగాహనా కార్యక్రమలు.
ఆపిటోరియా (అరబిందో )యూనిట్ 1 పరిశ్రమలో నిత్యం ఉద్యోగులకు కార్మికులకు భద్రత పరమైన శిక్షణను ఆ పరిశ్రమలోని (సేఫ్టీ) భద్రత డిపార్ట్మెంట్ ఉద్యోగులు శిక్షణను అందిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఆపిటోరియా పరిశ్రమలలొ జరిగిన చిన్న చిన్న ఘటనలే తప్పించి.పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగినట్టుగా లేదు.. అనునిత్యం భద్రతపరమైన శిక్షణను అందిస్తున్న ఉద్యోగులు ప్రమాదం జరిగినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఇతరులను ఎలా రక్షించాలో అనే అవగాహన కార్యక్రమాలతో ఆపిటోరియా యూనిట్ 1 యాజమాన్యం నిత్యం అప్రమత్తంగానే ఉంటుంది…భద్రత పరమైన శిక్షణతో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండడం వల్ల పరిశ్రమలొ ఇప్పటికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని చెప్పవచ్చు… పూర్తిస్థాయి భద్రతా వలయంలో ఆపిటోరియా యూనిట్ 1 మరియు దాని అనుబంధ పరిశ్రమ ఆన్ కాలేజ్ ప్రమాదల దాటినుండి రక్షించబడుతుంది అని చెప్పవచ్చు….

