శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వర్ణగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి తిరుమల శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున ఉదయం ఆలయ ప్రధాన ద్వారం స్వామివారి పాదాల వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి శ్రవణా నక్షత్రం సందర్భంగా సుమారు 400 మంది భక్తులు మహిళ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామాలను పటిస్తూ కోలాటాలు వేస్తూ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా భక్తులకు దర్శన భాగ్యాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు, చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణల ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది కల్పించారు. ఆదివారం రోజు కావడంతో స్వర్ణగిరి దివ్య క్షేత్రానికి భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం, శీఘ్ర దర్శనానికి రెండు సమయం పడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గిరి ప్రదక్షణలో పాల్గొనుచున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. భక్తుల దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

