ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గామాత భక్తజన బృందం కమటి అధ్యక్షుడు చిలక రాజు రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దేవి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. చౌరస్తాలో తలవరి మండపం సన్నిధిలో అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సాహలు అంగరంగ వైభవంగా నిర్వహించబడును.
సర్వేల్ గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని.ఈ కార్యక్రమన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబయింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. ప్రతి ఏటా దేవీ నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది. నిమర్జనం శోభాయాత్ర మహా వైభోపేతంగా కన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. సంస్కృతిక కార్యక్రమాలు ఆదరిస్తాయి. చిలక రాజు రాజు తేదీ 03/ 10/2024 గురువారం రోజు నుండి 13/10/2024 ఆదివారం వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తేదీ 03 గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు తోరణ అలంకరణ, గణపతి పూజ, పుణ్యావాహాచనం, రక్షాబంధనం, అఖండ మండపారాధన, అమ్మవారికి ప్రతిష్ట కలశ స్థాపన జరుపబడును అని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమ పూజ, తదుపరి అర్చనలు నిర్వహించబడును అని, తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో (అలంకరణలో) అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది.. తేదీ 7 సోమవారం రోజున ఉదయం 10: 30 నిమిషాలకు శ్రీ మహాచండి హోమం నిర్వహించడం జరుగుతుంది. బుదవారం 9వ రోజున విద్యార్థిని విద్యార్థులచే సరస్వతి దేవి పూజ చేయించబడును అని, అమ్మగారి ప్రసాదంగా పెన్నులు ఇవ్వడును అని, అదేవిధంగా అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12 వ తేదీ శనివారం రోజున విజయదశమి పురస్కరించుకొని ఉదయం 8 గంటల నుండి అర్చనలు, కుంకుమ పూజలు, వాహన పూజలు మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు శమీపూజ నిర్వహించడం జరుగుతుందని, తదనంతరం అమ్మవారి చీరలు వేలం వేయబడటం నిర్వహించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలు పాల్గొననున్నారు. గ్రామ మండల ప్రజలు, భక్తులు విచ్చేసి సేవలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయ సహకారాలు అందించి నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
