చెందుర్తి గ్రామ సందర్శనలో గొల్లప్రోలు పోలీసులు
NTODAY NEWS: కాకినాడ జిల్లా.
చెందుర్తి గ్రామ సందర్శన చెందిన గొల్లప్రోలు పోలీస్, ఈ కార్యక్రమం లో గొల్లప్రోలు పోలీస్ వారు ప్రజలతో మీటింగ్ నిర్వహించి, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయవద్దని, స్టూడెంట్స్ ను మంచిగా చదువుకోని పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది చెందుర్తి పరిసర ప్రాంతాలను సందర్శించి, డ్రోన్ సహాయం తో నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, నేరాలు జరగకుండా తగు చర్యలు చేపట్టడానికి కార్యాచరణ చేశారు. ఎవరైనా సరే పశువధ, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, జూదాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో గొల్లప్రోలు SI నౌడు రామకృష్ణ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

