చట్ల వెంకన్న రచించిన “రజకుల చరిత్ర” పుస్తకావిష్కరించిన గోపి రజక
➖ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
NTODAY NEWS: తెలంగాణ
▪ ప్రభుత్వాలు రజక రచయితలను ప్రోత్సహించాలి యామంకి యుగేంధర్
▪ రాష్ట్ర అధ్యక్షులు సర్ధార్ గోపి రజకను సన్మానించిన చట్ల వెంకన్న
బహుజనుల కులాల్లో రచనలు చేసే వ్యక్తులే అరుదు అందులో రజక కులంలో చాలా తక్కువ మంది రచయితలు ఉండటం వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం ఉండకపోవడం వల్ల మరుగున పడిపోయే ప్రమాదం లేకపోలేదు కాబట్టి కవులను కళాకారులను రచయితలను ప్రోత్సహించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ప్రభుత్వాన్ని కోరారు.
హన్మకొండ జిల్లా కేంద్రంలో
ఇప్పటికే రెండు పుస్తకాలు రచించిన చాట్ల వెంకన్న రచించిన “రజకుల చరిత్ర” పుస్తకావిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి పుస్తకాన్ని రచించి సమాజానికి అందించడం చాలా సంతోషంగా ఉందని గోపి రజక అన్నారు.రజక కులస్తుల జీవన విధానం చాకలి ఐలమ్మ పోరాట,మడెలేశ్వర స్వామి ,సంత్ గాడ్గేబాబా గురించి నేటి సమాజం తెలుసుకోవల్సిన అవసరం సమాజంలో రజకుల పాత్ర ఇలా అనేక విషయాలను చక్కగ రాసిన చట్ల వెంకన్న గారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ,రాష్ట్ర కళామండళి ప్రధాన కార్యదర్శి యామంకి యుగేంధర్ ,రాష్ట్ర ముఖ్యసలహాదారులు డాక్టర్ పాలడుగుల సురేందర్ ,ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్లగిరి కుమారస్వామి, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఐలోని అభిషేక్ ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గువ్వల అనీల్ రాజ్, ఐనవోలు మండల అధ్యక్షులు చాగంటి హన్మయ్య,మాదరపు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు

