ప్రతి కుటుంబంలో ప్రభుత్వ సన్న బియ్యం ఒక వరం—- పెద్ద కాపర్తి గ్రామ ప్రజలు
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం తెలంగాణ ఉచిత సన్న బియ్యం పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ప్రారంభమైన తెలంగాణ ఉచిత సన్నబియ్యం పథకం వలన పెద్ద కాపర్తి గ్రామంలోని కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 6000 వేల రూపాయలకు క్వింటల్ బియ్యాన్ని కొనలేక ఏదో పండగ పబ్బాలకు మాత్రమే సన్నబియ్యాన్ని తెచ్చుకొనేది పండగ వాతావరణం నెలకొల్పుకునేది కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇళ్లలో రోజు పండగ చేసుకుంటున్నాము. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం తీసుకోగలుగుతున్నాము, “ప్రజా ప్రభుత్వం “వచ్చిన తర్వాతఈ రెండు నెలల కాలవ్యవధిలో సన్నబియాలకు మార్కెట్లో ధర గణనీయంగా తగ్గాయి. అదేవిధంగా సన్న బియ్యం ఉత్పత్తి చేసే రైతులకు అదనపు ప్రోత్సాహంకల్పించేందుకు” బోనస్ “అందిస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి పెద్దకాపర్తిగ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు.