గ్రామ స్మశాన వాటికను కాపాడాలి అని వినతి పత్రం అందించిన గోవింద తండవాసులు
NTODAY NEWS:యాదాద్రి భువనగిరి జిల్లా,
బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో గురువారం రోజున నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో గోవింద్ తండా గ్రామపంచాయతీ సంబంధించిన గ్రామస్తులు గోవిందు తండా రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 1424 లో విస్తీర్ణం 2-1550 గుంటల భూమిలో మా తండా ప్రజలు ఎవరైనా చనిపోతే అట్టి భూమిలో దహన సంస్కరాలు, బొందలు పెట్టి స్మశాన వాటికగా మా తాతల కాలం నాటి నుండి వినియోగించుకుంటున్నాము అని,ఈ క్రమంలో కొంతమంది అక్రమదారులు అధికారులను తప్పుదోవ పట్టించి స్మశాన వాటికగా ఉన్న భూమిని ఎలాంటి విచారణ జరపకుండానే భూమి కబ్జా చూడకుండా స్మశాన వాటిక ఉపయోగించుకునే భూమిని ఇతరుల పేరు మీద రికార్డులో నమోదు చేసినారు అని కావున వారి పేరును తొలగించి శాశ్వతంగా గ్రామ కంట స్మశాన వాటికగా రికార్డు నందు నమోదు చెయ్యాలని గోవింద్ తండా ప్రజలు రెవెన్యూ సదస్సులో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మెగావత్ జైపాల్ నాయక్ ,లింగ నాయక్, పకీర నాయక్, శంకర్ నాయక్, శ్రీధర్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, రమేష్ నాయక్, హిర్య నాయక్,రవుజయ్ నాయక్, రెడ్డి నాయక్, తదితరులు పాల్గొన్నారు.













