చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించాలి
NTODAY NEWS: భువనగిరి, జూన్ 02
సందర్శకులు శిల్పారామం కు విచ్చేసి చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించాలన్నారు.
సోమవారం రోజున యాదగిరిగుట్ట లోని మినీ శిల్పారామం ను భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు కలసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పచ్చదనం గా శిల్పారామం ను చూసి ముఖ్య అతిథులు సంతోషం వ్యక్తం చేశారు.చేనేత హస్త కళాకారులకి యాదగిరిగుట్టలో ఒక వేదిక దొరకడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. గుట్టకు వచ్చే సందర్శకులు శిల్పారామం ను కూడా విచ్చేసి చైనా హస్తకలకారులను ప్రోత్సహించవలసిందిగా వారు కోరారు అనంతరం బోటింగ్ ను తిలకించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.