BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

చిట్యాల లో భారీగా గంజాయి పట్టివేత

తెలంగాణ
07 Aug, 2025 - 06:37 PM
325 వీక్షణలు
చిట్యాలలో భారీగా గంజాయి పట్టివేత NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో భారీగా గంజాయిని చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్న ఈ అంతరాష్ట్ర ముఠాను స్కెచ్ వేసి చిట్యాల సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్ తమ పోలీసు సిబ్బందితో పట్టుకున్నారు. వీరి వద్ద నుండి రెండు కార్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. చిట్యాల పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం డీఎస్పీ శివరాం రెడ్డి విలేకరుల సమావేశంలో మాటాడుతూ పట్టుబడ్డ వ్యక్తి నుండి 250 కిలోల గంజాయి, రెండు కార్లు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని . వీటి విలువ రూ.1 కోటి రూపాయలు ఉంటుందని అన్నారు. చిట్యాల టౌన్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు నూర్ మొహమ్మద్, పట్టు పడగా పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. పరారీలో ఉన్న నిందితులు, అందరూ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలకు చెందినవారే అని, రాహుల్ మిశ్రా అనే ఢిల్లీకి చెందిన వ్యక్తి వీరిని 20వేల రూపాయలు చెల్లించి గంజాయిని అక్రమతంగా వివిధ ప్రాంతాలకు తరలించడానికి నియమించుకున్నాడని ఈ ముఠాకు నేతృత్వం వహించిన మొనిస్ అలియాస్ రాహుల్ మిశ్ర ఢిల్లీలో గంజాయి అమ్మకం చేస్తున్నట్లు పట్టుబడ్డ నూర్ మహమ్మద్ అలియాస్ రాజా అనే నిందితుడు ఒప్పుకున్నాడని తెలియజేశారు వీరి పైన మారకద్రవ్య నిరోధక చట్ట 1985, సెక్షన్ 8 (C), 20(b)(ii)(C), 29 కింద కేసు నమోదు, నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్నటువంటి చిట్యాల పోలీస్ కానిస్టేబుల్ అయిన హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, మహసిన్ పాషా, కానిస్టేబుల్ వెంకన్న, రాజేష్ మహేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు. Follow us on Website Facebook Instagram YouTube