అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్

Spread the love

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం దసరా పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. సెలవులలో విహార యాత్రలు, తీర్థ యాత్రలు, ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్ నారాయణపురం ఎస్ ఐ జగన్ అన్నారు. ఊళ్లకు వెళ్ళేవారు ఇంటిని గమనించమని ఇరుగు పొరుగు నమ్మకస్తులైన వారికి చెప్పి వెళ్లాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు. పగటి వేళల్లో కాలనీల్లో చిరువ్యాపారుల్లా, సేల్స్ రిప్రజెంటేటివ్ల, అడ్రెస్ కోసం వెతుకుతున్న వారిలా పర్యటిస్తూ రెక్కీ నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తులుంటే స్థానిక పెట్రోలింగ్ మరియు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఉళ్ళకు వెళ్లేవారు విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి. అపరిచిత వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఆరాతీయడం, వారి ఫోన్ నెంబర్లును, వివరాలను సేకరించాలి. దీని ద్వారా చోరీలు జరిగే అవకా శాలను నివారిం చవచ్చు. పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ పోలీస్ సిబ్బంది యొక్క నెంబర్ దగ్గర పెట్టుకోవాలని అన్నారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియం త్రించడం చాలా సులభం. ఎప్పుడు కూడా స్థానిక పోలీసు స్టేషన్ నెంబర్ దగ్గరుంచుకోవడం మంచిది. కాలనీలలో గ్రామాలలో అనుమానాస్పద, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100 డయల్ కు సమాచారం అందించాలని ఎస్ ఐ జగన్ అన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.