నాగినేనిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మనుగడా సాధ్యమేనా?

Spread the love

నాగినేనిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మనుగడా సాధ్యమేనా?

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 26

బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల మనుగడ సాధ్యమేనా అనే అనుమానం కలుగుతుంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరిగి పాఠశాలల్లో పిల్లలు చేర్పించండి అని గ్రామస్తులను కోరుతున్నారు గ్రామస్తులు మాత్రం బొమ్మలరామారం, కొండమడుగు, బీబీనగర్, ఘట్కేసర్ ప్రైవేట్ పాఠశాలలకు గ్రామం నుండి 300 మందికి పైగా విద్యార్థులను పంపించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సంవత్సరాల క్రితం వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థులు పాఠశాలల్లో ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎందుకు ప్రభుత్వ పాఠశాలంటేనే గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎక్కడ లోపం జరుగుతుంది ప్రభుత్వ ఉపాధ్యాయులదా లేక ప్రభుత్వ అధికారులదా? తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు, విద్య అందించాలని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పజెప్పిన విషయం తెలిసిందే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు, విద్య అందించాలని విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా, మండల విద్యాధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్న నాగినేనిపల్లి గ్రామం పాఠశాలలో మాత్రం అమలు కావడం లేదు దీనికి కారణం ఎవరు? ప్రభుత్వ పాఠశాల చుట్టుపక్కన ఉన్న క్రషర్ కంపెనీలకు అనుమతి ఇచ్చిన మైనింగ్ అధికారుల లేక మండల రెవెన్యూ అధికారుల శాపమా? ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారులు.. గత నాలుగు సంవత్సరాల క్రితం గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 285లో క్వారీ బ్లాస్టింగ్ కి మరియు 283, 284 క్రషర్ కంపెనీకి అనుమతి ఇవ్వడంతో వారు చేసే బ్లాస్టింగులు మరియు క్రషర్ రవాణా వాహనాలు ద్వారా వచ్చే దుమ్ము, దూళితో విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అని విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నోసార్లు గ్రామ పెద్దలు, సర్పంచ్ పాలకవర్గం, గ్రామపంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చిన వారు పట్టించుకోలేదు గ్రామ ప్రజలు, గ్రామ యువజన సంఘాలు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విచారణ పేరుతో కాలయాపన చేయడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు మైనింగ్ హైదరాబాద్ సేఫ్టీ అధికారులు చెప్పిన ప్రకారం పాఠశాలకు, చెరువులకు, నివాసయోగ్యమైన ప్రదేశాలకు 300 మీటర్ల దూరంలో క్వారీలు క్రషర్లు ఉండరాదు అనే ప్రభుత్వ నిబంధనను జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారులు తుంగలో తొక్కి వారి సొంత లాభము చూసుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు 211 మీటర్ల దూరంలో ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 245/1( 2.832) హెక్టర్స్ లో యాదాద్రి భువనగిరి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజి మరియు డిప్యూటీ డైరెక్టర్ మైండ్స్ అండ్ జియాలజీ హైదరాబాద్ ప్రొసీడింగ్ నెంబర్  QL/YAD/LOI2700639 dt: 16.10.2023 నాడు కొత్తగా క్వారీ బ్లాస్టింగ్ కి అనుమతి ఇవ్వడం దీనికి నిదర్శనం ఇప్పటికైనా పాఠశాల మనుగడకు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top