క్రియాశీలక కార్యకర్తల భద్రతే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ లక్ష్యం – లక్ష్మణ కుటాల.
గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు కొండంత భరోసాగా ఉండాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వం నమోదు ప్రక్రియను ప్రారంభించి ఏదైనా అనుకోని ప్రమాదం కారణంగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న కార్యకర్త గాయాలపాలైతే 50000₹ రూపాయలు మెడికల్ ఖర్చులకు , దుర్ఘటన కారణంగా మరణం సంభవిస్తే వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల ప్రమాద బీమా పాలసీ వర్తించే విధంగా ప్రవేశ పెట్టడం జరిగింది. కదిరి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలకు వారి సభ్యత్వం నమోదు కార్డ్స్ పంపిణీ చెయ్యడం జరిగింది.అదే విధంగా గ్రామ , పట్టణ , ప్రాంతాల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం పార్టీ సిద్ధాంతాలను , ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల కార్యకర్తలకు తెలియజేశారు. కదిరి నియోజకవర్గంలో అధినేత ఆశయాలకు అనుగుణంగా 4వ విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియలో 380 సభ్యత్వాలు చేసిన లక్ష్మణ కుటాల గారిని జనసేన పార్టీ కార్యకర్తలు అభినందించారు.ఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఇనొద్దీన్ , హరీష్ వాల్మీకి , నీరుగుట్టి గణేష్, ఐటి వింగ్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్ పొరకల , వెంకట రమణ , లక్ష్మీ నరసప్ప , కృష్ణ , జై కిషన్ , యోగేంద్ర , వేణుగోపాల్, కరమల మిథున్ , సుధాకర్ , అడపాల వెంకటేష్, ఆనంద్ కృష్ణ, కార్తీక్, లక్ష్మీపతి తదితరులు పాల్గొని తమ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్లను అందుకున్నారు.