ఈనెల 9,10,11 తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న సిపిఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి — సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
NTODAY NEWS : తుర్కపల్లి, జూన్ 07
ఈ నెల 9,10,11 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతును జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు సిపిఎం తుర్కపల్లి మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేపట్టడానికి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ క్లాసులను నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు,తాగునీరు సమస్యల పరిష్కారం చేయడంలో, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు సక్రమంగా వేయడం లేదని వెంటనే విడుదల చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈనెల 9,10,11 తేదీలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్లాసులలో గ్రామ, మండల, జిల్లా నాయకత్వం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్, మండల కమిటీ సభ్యులు కుక్కొండ లింగయ్య, తలారి మాతయ్య, తూటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.