పెద్దకాపర్తి గ్రామంలో జయశంకర్ బడిబాట కార్యక్రమం
NTODAY NEWS
రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో “ప్రొఫెసర్ జయశంకర్” బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జూన్ 6 నుండి 19వ వరకు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెద్ద కాపర్తి గ్రామంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాల విశిష్టత గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లుకేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యను అందించబడుతుందని, ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తుందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్నారని అన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో 20 అడ్మిషన్లను చేర్పించారు . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు , గ్రామ ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.