News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

Jio: జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..

Spread the love

డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ కంపెనీగా అవతరిచింది. ఎంతలా అంటే జియో డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది ఏకంగా 33 శాతం అధికం కావడం గమనార్హం. చైనాకు చెందిన బడా కంపెనీలను సైతం జియో వెనక్కి నెట్టడం గమనార్హం. రిలయన్స్‌ జియో తాజాగా వెల్లడించిన జూన్‌ త్రైమాసిక గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది…

టెలికం రంగంలో జియో సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు ఇంటర్నెట్‌ డేటాను ఆచితూచి ఉపయోగించిన యూజర్లు జియో రాకతో ఎడాపెడా వాడేయడం మొదలు పెట్టారు. తక్కువ ధరకే డేటా అందుబాటులోకి రావడంతో చాలా మంది జియో యూజర్లుగా మారారు. దేశంలో అత్యంత త్వరగా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు సంపాదించుకున్న సంస్థగా జియో రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే తాజాగా జియో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

డేటా వినియోగంలో జియో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ కంపెనీగా అవతరిచింది. ఎంతలా అంటే జియో డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది ఏకంగా 33 శాతం అధికం కావడం గమనార్హం. చైనాకు చెందిన బడా కంపెనీలను సైతం జియో వెనక్కి నెట్టడం గమనార్హం. రిలయన్స్‌ జియో తాజాగా వెల్లడించిన జూన్‌ త్రైమాసిక గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది. దేశంలోని మొబైల్ యూజర్లలో సగటును రోజుకు 1 జీబీ కంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్న ఏకైక కంపెనీగా జియో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

మరీ ముఖ్యంగా జియో యూజర్లు 5జీ డేటాను విరివిగా ఉపయోగిస్తున్నారు. పెద్ద మొత్తంలో 5జీ డేటా ఉపయోగిస్తున్న జియో కసమర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లకు చేరడం విశేషం. ప్రస్తుతం జియో 5జీకి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కొందరు యూజర్లకు 4జీ డేటాతోనే అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తోంది. ప్రస్తుతం జియోకు భారత్‌లో 49 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. గడిచిన ఒక్క ఏడాదిలోనే జియోకు 4 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరడం విశేషం.

ఇదిలా ఉంటే కేవలం మొబైల్ యూజర్లే కాకుండా వైర్‌లెస్‌ ఇంటర్నెట్ పరంగా కూడా జియో రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం సుమారు 10 లక్షలకు పైఆ ఇళ్‌లలో ఎయిర్‌ ఫైబర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ రికార్డు సాధించిన తొలి టెలికాం కంపెనీ కూడా జియోనే కావడం విశేషం. ఇంటర్నెట్‌తో పాటు, జియో వినియోగదారులు వాయిస్ కాలింగ్‌లో కూడా ముందున్నారు. జూన్ త్రైమాసికంలో వాయిస్ కాలింగ్ విషయంలో కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇప్పుడు రికార్డు స్థాయి 1.42 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top