జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల లో రాయితీ ఇవ్వాలి.– టీయూడబ్ల్యూజే, (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి
NTODAY NEWS: నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూనూరు మధు
నల్గొండ జిల్లా పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, జర్నలిస్టు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం డీఈవో బిక్షపతికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డిఈఓ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ ఇప్పించేందుకు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అమలయ్యేందుకు కృషి చేస్తానని డిఇఓ హామీ ఇచ్చారు. ఏదైనా పాఠశాల యజమాన్యం వినకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలని అధికారులను వెంటనే ఆదేశించారు. డీఈఓ కు వినతి పత్రం సమర్పించిన వారిలో ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు మాదరి యాదగిరి, జిల్లా నాయకులు పులిమామిడి మహేంద్ర రెడ్డి, టౌన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏరెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, జర్నలిస్టులు జిల్లా యాదయ్య, తెలగమల్ల దశరథ గంగాధర్ వెంకటేశ్వర్లు, సోమ చంద్రశేఖర్, అంజయ్య, అశోక్, రాంప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.