అనుమానాస్పద ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ
NTODAY NEWS: కాకినాడ జిల్లా
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు kakinada Sub-Divisional ASP దేవరాజ్ మనీష్ పాటిల్ మరియు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పర్యవేక్షణలో గొల్లప్రోలు ఎస్సై శ్రీ ఎన్ రామకృష్ణ గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ పోలవరం కాలువ పరిషర ప్రాంతాల్లో అక్రమంగా పశువులను వధించి మాంసాన్ని ఎగుమతి చేయడానికి అవకాశం ఉన్న అనుమానాస్పద ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమైనది. అదే సమయంలో అచట అనుమానాస్పదంగా తిరుగుతున్న బొడ్డపాటి సూరిబాబు తండ్రి నాగన్న చందుర్తి గ్రామం అను అనే వద్ద సంచులు తాడు కత్తి కలిగి ఉన్నందున మరియు ఇతనిపై 2008వ సంవత్సరంలో పాత కేసు ఒకటి ఉన్నందున అతనిని అదుపులోనికి తీసుకుని గొల్లప్రోలు ఎమ్మార్వో వద్ద బైండ్ ఓవర్ చేయడమైనది.













