వర్షాకాలంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి — మున్సిపల్ చైర్మన్ దండు శ్రీను
NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ లో జరుగుచున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ డి.శ్రీను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. చిట్యాల మున్సిపల్ కేంద్రంలో నాలుగు, ఏడో వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున మురుగు కాలువల వెంట ఉన్న గడ్డి మరియు పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. నీటి నీలువలు ఉన్న దగ్గర ఆయిల్ బాల్స్, పైరిత్రిను స్ప్రే చేయవలసిందిగా సూచించారు. అంతే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని వార్డు ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్, జవాన్ నరసింహ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

