పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణను రక్షించుకుందాం– జిల్లా ప్రధాన న్యాయమూర్తి
NTODAY NEWS: భువనగిరి, జూన్ 06
ప్రపంచ పర్యావరణ దినోత్సవం, సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ,యాదాద్రి భువనగిరి అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు,సంస్థ కార్యదర్శి, వి.మాధవిలత గురువారం రోజున కోర్టు ఆవరణలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాలి,మొక్కలు నాటడం మరియు పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు,జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడి తద్వారా కాలుష్యాన్ని నియంత్రించగలిగితే మనిషికి మనగడం సాధ్యమవుతుందని భావితరాలకు ప్రాణవాయువును అందించగలిగే వారం అవుతామని,మానవ సమాజం నాగరిక సమాజంగా పెంపొందడానికి, ప్రకృతి వనరులను కాపాడి సరియైన పద్ధతిలో ఉపయోగించుకుంటే రేపటి తరానికి మనం మంచి జీవనాన్ని అందజేయగలుగుతామని,ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వినియోగించడం నిషేధించాలని దీనిపై ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని కేవలం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాత్రమే కాకుండా జీవన చర్యలలో దీన్ని ఆచరించి పాటించాలని ప్రకృతి పరిరక్షణ చట్టం దీనికి ఏర్పాటు చేయబడిందని, జీవసమతుల్యాన్ని కూడా పాటించాలని నానాటికి ఓజోన్ పొర నిర్వీర్యమవుతుందని దీనిని కాపాడాలని తెలియజేశారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా మాట్లాడుతూ నేటి తరానికి ప్రకృతి పర్యావరణంపై అవగాహన పరచి గ్లోబల్ వామింగ్ ను తగ్గించేలా చైతన్యం తీసుకోవాలని తెలియచేసారు. సంస్థ కార్యదర్శి వి.మాధవిలత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ చట్టాలను పాటించాలని,ప్లాస్టిక్ వాడకాన్ని నిరోదించాలని, నీటిని వృధా చేయరాదని తెలిపారు. భువనగిరి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి యం.ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వాతి,యాదాద్రి భువనగిరి జిల్లా అటవీ శాఖ అధికారి కె. రమేష్,భువనగిరి బార్ అసోసియేషన్ కార్యదర్శి బోల్లేపల్లి కుమార్, సి.ఎస్.ఎన్. ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డిలు పర్యావరణాన్ని పరిరక్షించాలని,అడవులను పెంపొందించి వణ్యప్రాణులను రక్షించాలని,ప్లాస్టిక్ వాడకాన్ని నిరోదించాలని తెలిపారు. ఇందులో జాతీయ సేవ పథకం లెక్చరర్స్, విద్యార్థినులు పాల్గొని ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చంద్రశేఖర్ రెడ్డి, రాజిరెడ్డి, బొమ్మ వెంకటేశం, సాగర్, రాజేందర్ రెడ్డి, న్యాయ సహాయ న్యాయవాదులు ఎస్. జైపాల్,జి.శంకర్, తదితరులు పాల్గొన్నారు.