ఘనంగా మహాలింగేశ్వర స్వామి కళ్యాణం..
కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వీరేశం.
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు ఐన శివనేని గూడెంలో మహాలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి అశేష జనవాహిని మధ్య అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెచ్చిన తలంబ్రాలను స్వామి అమ్మవార్లకు అందజేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన పరిధిలో చలువ పందిర్లను, తీర్థప్రసాదాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. కళ్యాణ అనంతరం దేవస్థాన ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం తో పాటు సాయంత్రము పలహారపు బండ్లను కార్యక్రమాన్ని కనుల పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మహా లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తన వంతు కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సందర్శించిన ఆయన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మొదట దేవస్థానం వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తిరిగిన కల్యాణానికి వచ్చిన భక్తుల తోటి మాట్లాడి త్వరలోనే ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య, కాటం వెంకటేశం మరియు ఆలయ కమిటీ సభ్యులు దాదే విఠల్ రెడ్డి, మల్లెబోయిన మల్లేష్, గంగాపురం లింగస్వామి, రేముడల నర్సింహ, చొప్పరి లింగస్వామి, దాదే ఉపేందర్ రెడ్డి, రేముడల ఉపేందర్, నోముల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.