నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్ర సిద్ధించడానికి అహింసా మార్గాన ఎన్నో పోరాటాలు చేసి భారతదేశం స్వతంత్ర సాధించడంలో గాంధీజీ ప్రముఖ పాత్ర వహించాడని , గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటిస్తూ భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శానిటేషన్ విభాగానికి చెందిన కార్మికులను శాలువాతో సత్కరించారు .ఈ సమావేశంలో కమిషనర్ పి వీరేందర్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, మరియు వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు మున్సిపల్ ప్రజలు పాల్గొన్నారు.
