చలో ఒంగోలు సిపిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర 28వ మహాసభల
NTODAY NEWS: కదిరి నియోజవర్గం రిపోర్టర్ -వినోద్ కుమార్
ఈనెల 23 శనివారం నాడు ఒంగోలులో జరుగుతున్న మహా ప్రదర్శన మరియు బహిరంగ సభకు
శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సమితి తరపున మరియు సిపిఐ శుక్రవారం కదిరి రైల్వే స్టేషన్ నుంచి ఒంగోలుకు బయలుదేరుతున్న వ్యవసాయ కార్మిక సంఘం శ్రేణులు తరలి వెళ్తున్నట్లు
జిల్లా కార్యదర్శి బి కదిరప్ప తెలిపారు. సిపిఐ శత వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు 23 నుండి 25 వరకు జరుగుతున్నాయని వారు తెలిపారు. మహాసభల ప్రారంభ సందర్భంగా 23వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు నగరంలో నెల్లూరు బస్ స్టాప్ నుండి మహా ప్రదర్శన జరుగుతుందని అనంతరం అద్దంకి బస్టాప్ వద్ద బహిరంగ సభ జరుగుతుందని వారు తెలిపారు. ఆగస్టు 24, 25 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. మహాసభలలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు తీర్మానాలు చేయడం జరుగుతుందని, అలాగే ప్రజా సమస్యల పైన, భూ సమస్యల మీద తీర్మానాలు చేసి పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని శ్రీ సత్య సాయి జిల్లా నుండి ప్రతినిధుల సభకు పార్టీ సభ్యత్వం ప్రాతిపదిక మీద మరియు రాష్ట్రస్థాయి ప్రజాసంఘాలకు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో కలిపి ప్రతినిధులు పాల్గొంటారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవసాయ కార్మిక సంఘం రమణ, ఏఐటిసి జిల్లా అధ్యక్షులు మధు నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శేష మహేంద్రా, సిపిఐ డీవిజన పావన్ కార్యదర్శి పట్టణ కార్యదర్శి ఇలియాకత్ ఎల, మండల కార్యదర్శులు నాయకులు శ్రీరాముల నాయుడు, చలపతి స్వామి, ఎల్వి రమణ, కొండయ్య ,ఆదెప్పరామచంద్ర, రెడ్డప్ప, మహిళా సంఘం నాయకురాలు విమల బాయ్, భవాని ,సుధారాణి, మౌనిక, జ్యోతి, ఇందిరమ్మ, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

