ఈనెల 10వ తేదీన కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాని విజయవంతం చేయండి
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి
ధర్మ బిక్షం స్థాపించిన గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గీత పని వారల సమస్యలపై ఈనెల 10వ తేదీన కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాని విజయవంతం చేయండి .
గీత పని వారల సంఘం రాష్ట్ర కార్యదర్శి బోలగొని సత్యనారాయణ గౌడ గీతన్నలకు, గీతపనివారలకు పిలుపు.
సోమవారం భువనగిరి కేంద్రంలోని గీత పనివారల సంఘం ఆఫీసులో జరిగిన గీతపనివారల సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశానికి చాపల అంజయ్య, గాదగాని మాణిక్యం అధ్యక్షత వహించారు, ఈ సందర్భంగా హాజరైన గీత పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శి బోలగాని సత్యనారాయణ మాట్లాడుతూ ధర్మబిక్షం గారు 1957లో స్థాపించిన గీతపనివారల సంఘం ఎల్లప్పుడూ గీతపనివారల సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని , అదేవిధంగా ధర్మబిక్షం గారు గీతపనివారల ఆధ్వర్యంలో సాధించిన విజయాలే ఉన్నాయి గానీ ఇప్పటివరకు గౌడ సంఘం, కార్మిక సంఘం అని చెప్పుకుంటున్న ఏ సంఘం కూడా గీతపనివారల గురించి సాధించింది ఏమీలేదని తెలియజేశారు. తాటిచెట్లు ఎక్కి 50 ఏండ్ల కే పటుత్వం పోతారు కాబట్టి 50 ఏండ్లు నిండిన గీతపనివారలకు పింఛన్ గాని, 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమిని వనం పెంపకానికి ఇవ్వాలని గీతపనివారలు శాశ్వత వికలాంగులు అయితే, అదేవిధంగా చనిపోతే ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని ధర్మబిక్షం గారు ఆనాడే సాధించారని, ఇంతవరకు ఏ సంఘం కూడా గీతపనివారల సమస్యలపై పోరాడింది గాని, సాధించినది గానీ ఏం లేదని అందరూ గుర్తించాలని తెలియజేశారు. అదేవిధంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి గీత పనివారల పింఛన్లు గాని, 13 కోట్ల ఎక్స్ గ్రేషియో లు విడుదల చేయనందున, ప్రతి జిల్లా, ప్రతి మండలాల్లో నీరా కేంద్రాలను ఏర్పాటు చేయనందున, గీతపనివారలకు టీవిఎస్ వెహికిల్స్ ను ఇవ్వనందున, మెడికల్ బోర్డును రద్దు చేయనందున, ఫించను 5000 కు పెంచుతానని పెంచనందున ,ఇంకా ఇతర సమస్యలపై ప్రభుత్వానికి మెమోరండంలు ఇచ్చినా కూడా స్పందించనందున ఈనెల 10వ తారీఖున అన్ని ఎక్సైజ్ ఆఫీసుల ముందు, కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించి గీత పనివారల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని దిగి వచ్చే విధంగా ధర్నాను, సదస్సును నిర్వహించి మన సమస్యలను తీర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు, ఈ ధర్నాకు గౌడన్నలు, గీతపనివారలు హాజరై విజయవంతం చేయాలని కోరారు…సమావేశంలో గీతపనివారల సంఘం జిల్లా కార్యదర్శి పబ్బు యాదయ్య , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎర్ర రమేష్ గౌడ్, బాలగోని సత్యనారాయణ గుండు వెంకటేష్, బత్తిని శ్రీనివాస్, చిత్తర్ల శ్రీనివాస్, పులిపలుపుల మల్లేష్, పుట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు..

