సభకు వేలాదిగా తరలివచ్చి విజయవతం చేయండి – ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
NTODAY NEWS: తుర్కపల్లి, జూన్ 04
యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, తిరుమలపురం గ్రామ వేదికగా సుమారు 1500కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని, ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పరిశీలించారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ జూన్ 6 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం కోసం వస్తున్న సందర్భంగా సభ స్థలాన్ని, ఏర్పాట్లును పరిశీలించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపి వాటిని ఆచరణలో చూపిస్తున్నారని అన్నారు.ఈ మెరుకు ప్రతి ఎమ్మెల్యే తో మాట్లాడి కొన్ని సంవత్సరాలుగా శాశ్వతంగా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగిందన్నారు. ఆలేరు నియోజకవర్గానికి 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డికి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇతర మంత్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం నుండి 6 తారీకు జరగబోయే బహిరంగ సభలో ప్రజలు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున భువనగిరి నియోజకవర్గం నుండి యువకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నట్లు తెలిపారు.30 ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న గంధమల్ల ప్రాజెక్టు 700 కోట్లతో, ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లతో, యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 183 కోట్లతో, యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కోసం 100కోట్లతో, సిఆర్ఆర్-ఎంఆర్ఆర్ ఆర్ఎంబి నిధులు 80 కోట్ల రూపాయలతో, యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణానికి 46 కోట్లతో, వేర్ హౌస్ గోదాముల 20 కోట్లతో, కొలనుపాక, కాల్వపల్లి, హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాల కోసం 15 కోట్లతో, అదేవిధంగా మోటకొండూరును కేవలం మండలంగా చేసి గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని,అందుకే ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజల కోసం మూడు ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.వీటన్నింటిని శంకుస్థాపన చేసేందుకు జూన్ 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామానికి రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం, ఉమ్మడి నల్గొండ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు,నాయకులు , ప్రజాప్రతినిధులు, యువకులు, తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు.