మిషన్ భగీరథ తాగునీటి సమస్యను త్వరితగతిన పునరుద్ధరించాలి.!!!
NTODAY న్యూస్: లక్ష్మి ప్రసాద్ మెదక్ &సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30
★పనిచేయని మోటార్లను వెంటనే రిపేరు చేయాలి,
★భవిష్యత్తులో మిషన్ భగీరథ తాగునీటి సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ట కార్యచరణ చర్యలు చేపట్టాలి,
★మిషన్ భగీరథ అధికారులను ఆదేశించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం జక్కన్నపేట్ గ్రామంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ ను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
జక్కన్నపేట ఇంటర్మీడియట్ పంప్ స్టేషన్లో పనిచేయని మోటార్లను పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేసి సాధ్యమైనంత త్వరగా మిషన్ భగీరథ నీళ్లు 35 గ్రామాలకు పంపించాలని అప్పటి వరకు తాత్కాలికంగా లోకల్ సోర్సెస్ ద్వారా అన్ని గ్రామాలలో మంచినీళ్లు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. పెద్దిరెడ్డి పేట నుండి జక్కన్నపేట ఇంటర్మీడియట్ పంప్ హౌస్ కి నీరు సరఫరా అవుతుందని, అక్కడినుండి 35 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందని, 75 హెచ్పి మోటార్స్ రెండు కాలిపోవడం వల్ల గత వారం రోజుల నుండి నీటి సరఫరా నిలిచిపోయిందని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో ఉన్న నీటి వనరుల నుండి సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు..యుద్ధ ప్రాతిపదికన మోటార్లు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మోటార్ల మరమ్మత్తులకు సమయం పడుతున్న సందర్భంగా తాత్కాలిక మోటార్లు తెప్పించి బిగించి రేపు మధ్యాహ్నం వరకు నీరు సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
భవిష్యత్తులో జిల్లాలో మిషన్ భగీరథ త్రాగునీరు ప్రజలకు సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టాండ్ బై మోటార్లు
ఉంచుకోవాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నికిత, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

